1, ఏప్రిల్ 2020, బుధవారం

నేను వేగలేనాదూరాన దుశ్శాసనుడున్నాడని
వెనుకకు మరలి పోతున్నావు
కళ్ల ముందు కారు చీకటి కమ్ముకున్నదని
కనబడకుండా పోతున్నావు
దోపిడి రాజ్యం ఏలుతున్నదని
దొంగ పిల్లివై పోతున్నావు
ఇసుక నిండిన ఎడారిని చూసి
వేగలేనని పారిపోతున్నావు.....
ఆగు.. ఆగు.. ఆగు! నడి సంద్రంలో
నావికునివోయ్ నీవు
పద.. పద.. పద! నువ్వే...
నవ కళియుగ వైతాళికునివోయ్
బాణాన్ని ఎక్కుపెట్టి
భ్రష్టుల తలల చేదించవోయ్
మనోతేజాన్ని నీలో నింపుకొని
సూర్య కిరణంలా ఝూంకరించవోయ్
కాలం చెల్లిన దోపిడి రాజ్యంపై
చిరుత పులిలా చిందులేయ్
నీరింకిన ఎడారిలో ఓయాసిస్సులా విరజిల్లు
అగమ్య గోచరమైన ఇండియాని
అపురూప కళానిలయమైన భారతంగా భాసించనీయి            ---16.10.1999

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి