1, ఏప్రిల్ 2020, బుధవారం

సున్నము ముద్ద



అంతరంగిక రాగాలతో అలరించే అందాలతో
చీకటి కోణాలనే చీల్చుకు వచ్చే
సూర్య కిరణంలా ఆకాశ హర్మ్యాలనే నిర్మిస్తావో... కాదు
కాదంటు గుండెల్లో సూదంచు రాయిలా పోటేస్తావో..
తేల్చుకొమ్మంటున్న తేట తెల్లని సున్నము ముద్దను నేను!
బుస బుస పొంగే నా ప్రాయంలో అగ్నిశిఖలు ఆరకుంటాయా!
గోమాత నుదుటన పెట్టిన ఎర్రటి రక్త చందనం వలె
పాలిండ్ల నుంచి పాలొస్తే...
మహా ప్రళయమే వస్తుందా...
మహా భారతం వుంటుందా..
జీవిత కాలం శిలలా నిల్చుండే కంటే ఒక్కరోజైనా
మహా ప్రళయంలా విజ్రుంబించి విలయ తాండవాలతో నర్తిస్తూ...
నరజాతి చరిత్ర సమస్తాన్ని
పునర్నిర్మిస్తూ పున్నమి చంద్రుని వలె వెలుగొందు              ---14.10.1999

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి