సముద్రపు అలలు ఘీంకరిస్తున్నాయని
పల్లము వైపు పరుగులు తీసా...
వెరసీ వెరవనట్టుగా... అక్కడొక చిత్రం!!
ఆకాశం తెగిపడేలా ఉందని
ఇరుకు సొరగులో అడుగేసా...
చీకటి దర్పణంలో…
అస్పష్టంగా అక్కడొక రూపం!!
మా వాళ్లే కావచ్చుననుకొని
ఆగమంటూ తన దరి చేరా...
అస్తవ్యస్తంగా చిరాకుతో నవ్వుతోందతని ముఖం!
ఏమైందీ ప్రపంచానికి అని
అర్థం కాని ఆలోచనలతో..
పత్రిక తిరగేసా...
టెర్రరిస్టుల భయంతొ ఉన్న
ప్రదాని పోటోలతో అది సంపూర్ణం!
అది మూసి నా మనసును తెరిచా
సంఘర్షన కల్లంలో..
ఆలోచనల పర్వంలా..
అస్పష్టంగా
ఆరూపం... ఆచిత్రం... ఆ ముఖం....
ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి
వీటన్నిటి కలగలుపుతో తీసా ఓ చిత్రం
అది
భయమే మానవ ముఖ చిత్రం. ---07.02.2002
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి