4, ఏప్రిల్ 2020, శనివారం

నా అక్షరాలు ఉషోదయ ప్రాకారాలు


చీకటి జారిపోతుంది
ఓ వెలుగుకి చోటివ్వాలంటూ...
తరగకుండా తిరిగే భూమిపై
తరిగిపోయిన కాలం గుర్తుల్లో.... నాకథలు
గతం గడవాలనుకంటూ
ఏదో గడిచిందంటూ
గతంలోని గడ్డుకి
బుర్రలోని జిడ్డుకి
మైనం పూసిన మౌనం
రాలిన ఈ వత్సరం
సగం చీకటి చిక్కగా అల్లుకున్న
ప్రతీ క్షణం
మిలలా మెరిసిన నా ఆశలకి వందనం
రాస్తున్న కొద్దీ ఆరిపోతున్న సిరలా
దిగమింగినకొద్దీ ఎగిసిపడుతున్న కలలూ
కన్నీరు చిలిందొక బిందువై...
గడిచిపోయిన కాలానికి సూచికై
వెలుగై విరజిమ్మే నా భావాలు
ఈ నూతన ఉషోదయ ప్రాకారాలు             28.12.2004

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి