4, ఏప్రిల్ 2020, శనివారం

తెలుగు రమణకి అశ్రాక్షర నివాళి


అజరామరమైన సూర్యునికి అస్తమయమా...
రమణీయమైన కథాస్వాప్నికుడికి నిష్క్రమణమా..
నిశీది నీలిమబ్బుల్ని కమ్మిన విధి
నివ్వెర పోయేలా చేసిన...
నిబ్బరమైన నీ గుండెని ఆపేశానని
వికటాట్టహాసం చేసినా...
చిచ్చర పిడుగుల బుడుగులు తెలుగుదనానికి
కళ్లలాంటి రెండు జెళ్ల సీతల్ని ఆపడం ఎవరితరం
మడిసన్నాక కూసింత కళాపోసనుండాలన్న నీ విరుపులు
ఆమ్యామ్య బరువుల్లాంటి పదాలతో నీ మెరుపులు
అక్షరాలు ఉన్నంత కాలం
తెలుగుభావుటా ఎగిరినంత కాలం
చిరంజీవులే...
రమణీయమైన నీ స్మ్రతులు
కమనీయమైన నీ రచనలు
మా తెలుగు లోగిళ్లలో వెలుగులు విరజిమ్ముతూనే ఉంటాయ్
కంటిపాపల్లో నీ రూపాన్ని నిలుపుతూనే ఉంటాయ్              ---24.02.2011


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి