3, ఏప్రిల్ 2020, శుక్రవారం

నూతన తెలగాన సహస్రాబ్ది కోసం



సంవత్సరాంత అంధ యుగంలో
స్వాతంత్ర్య మనేదానికి లిఖితార్థం ఏమిటో!
చస్తూ బ్రతుకుతున్న నేటి సమాజంలో
అలలు తీరాన్ని చేరేదెప్పుడో!
ఆకలి మంటలు రగులుతున్న సమాజంలో
లార్వాను లాలించక తప్పదా...
క్షణ క్షణ మొక నరకంలా..
సంవత్సరాలు సాగిపోతున్నప్పుడు
అంక మాద్యమంలో మార్జాలంలా..
మరుగుతున్న చన్నీటిని ఆవిరి చేస్తావా!
తిందామరి బువ్వకుండ దరికెల్తే..
నిండుకున్న కుండను చూసి గుండె మండకుంటుందా!
చెల్లి పెళ్ళి కోసం దాచిన డబ్బుని
దొరగాడొచ్చి లాక్కెల్తే...
నా మనసును లాలిస్తూ... బుజ్జగిస్తూ... ఊరకున్నాను.
పంటచేను కోతకొచ్చిన వేళ
గాలి వానల చదరంగంలో పావులా పడిపోయాను
నా ముందున్న కటిక చీకట్లో
దీపం పురుగులా వెలుగు జాడకై వెదుకుతున్నాను.
తల్లినీ, చెల్లినీ పోషించలేని
చావు, బ్రతుకుల సాలే పురుగుని నేను
వాడొచ్చి తంతాడు. వీడొచ్చీ తంతాడు
నడుమ నలుగుతున్న సామాన్య నరున్నే నేను
మలయ మారుతాల వీణ
నా తెలంగాణ లోనా
ఆకలైనప్పుడు కడుపు నింపే
పున్నమి చంద్రున్ని నే కావాలని కాంక్షిస్తూ...
నూతన సహస్రాభ్దికి
స్వాగతం.. సుస్వాగతం... 22.10.1999

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి