ఆర్నవ, హర్షవ సామ్రాజ్యంలో
ఆకలి మంటలు పుడుతున్నాయట
కారు చీకటి కమ్మిన గోడల్లో
ప్రజలే బంధీలౌతున్నారట
వెలుగు నివ్వలేనని సూరీడు
మండి ఎండి పోతున్నాడట
కణ కణ మ్రోగే కంచు గంటలు
మ్రోగలేక మోడు వారుతున్నాయట
ఆకాశంలోని తారామణులు
వెలుగలేక రాలిపోతున్నాయట
ఇదంతా ఎక్కడ.. ఎక్కడ... ఎక్కడని
నువ్వడిగే వేలా...
చెపుతున్నాను నా గుండెల్లోంచి
చీల్చుకువచ్చే విరహ వేదనను
ఇది! నారీమణుల నరాలు లాగే
ఈ దేశంలోనే
ఇది! బందానుబందాలు లేని కామ పిశాచాలున్న
ఈ దేశంలోనే
నువ్వు నవ సమాజాన్ని
మర్చాలంటే మారు
మారాలంటే మార్చు ---18.10.1999
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి