కదులుతున్నప్పుడు జలానికేదో శక్తుంటుంది
రాస్తున్నప్పుడు కలాన్నేదో ఆవహిస్తుంది
పరీక్షున్నప్పుడు పఠనానికేదో స్పూరనౌతుంది
స్నేహమున్నప్పుడు మనసుకేదో స్పూర్తొస్తుంది
ఏంటో...
అన్నింటికి ఆరాటమే
పోరాటం ముందున్నట్టుగా...
చెప్పె చదువులోనైనా
చూపే కరుణలోనైనా
ఆత్మీయమైన నీ ఆదరణ చూస్తుంటే...
మా వూల్లో వున్న అక్కొచ్చి
నేర్పిస్తున్నట్టుంటుంది
మళ్లీ...
ఎన్నాళ్లకి నిను చూచినా
ఏ క్షణం గుర్తొచ్చినా
నా కంట్లోని ఆనందభాష్పం
నిన్ను అభిమానిస్తూనే ఉంటుంది. ---07.12.2004
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి