4, ఏప్రిల్ 2020, శనివారం

మాన్యులారా జాగ్రత్త


ఇటు ఒకమాట అటు ఒక ఆవేదన
మాటా మాటా కలిసి పోరుబాటలౌతున్నాయ్
బొట్టు బొట్టు కలిసి రక్తదారులు పారుతున్నాయ్
నీటి కోసం కన్నీటి ప్రవాహాలు పొంగుతున్నాయ్
భూమికోసం భువణాంతరాలు దద్దరిల్లుతున్నాయ్
చేష్టలుడిగి కూర్చుండడానికే ఐతే
సమాజాన్నేలే రాచరికమెందుకు
ఏమితోచని అయోమయమే ఉంటే
అందలాన్నెక్కే ఆరాటమెందుకు
మాటల గారడీలతో మాయల మోసాలతో
మాన్యున్ని మరిపించాలని చూస్తే
అసామాన్యుడే గర్జిస్తాడు
హక్కుల సాధనకై ఉద్యమిస్తాడు
నియంతలని అసహాయులుగ చేసి
ప్రపంచగతులని మార్చిన నిష్గుర సత్యాలివి
ఇకనైనా కళ్లు తెరవండి
చెవులారా వినండి
చరిత్రలో మిగలండి.                            24.02.2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి