4, ఏప్రిల్ 2020, శనివారం

నా కళం


నా కళం తాడిత పీడిత జనాల కోసం
ఎలుగెత్తే గళం
తరతరాల దుర్నీతి బూజుదులిపే ఆయుదం
నిస్సిగ్గుగా జనజీవితాలతో ఆటలాడే అక్రమార్కులపై
ఎక్కుపెట్టిన పాశుపతాస్త్రం
నా కళం
ఆశచచ్చి అణగారిన మనస్సులకి
జవజీవాలని నింపే నవయవ్వన కుసుమం
శాంతి కోసం అనుక్షణం తపించిన
అమరవీరులకి ప్రణమిల్లే కళం
ప్రయాణం మెదలెట్టిన చిరుప్రాయంలోనే
చండ్ర ప్రచండ నిప్పులతో
నిజాలను నిగ్గుతేల్చిన నాకళం
చిరకాలం తను నమ్మిన ఆదర్శాలను ఆచరిస్తూ..
అనుక్షణం అలుపెరగక పయనిస్తూనే ఉంటుంది
నికార్పైన నిజాలకై అన్వేషిస్తూనే ఉంటుంది.                      ---06.01.2010

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి