1, ఏప్రిల్ 2020, బుధవారం

వేదనలో విరహాగ్ని



నా గుండెల్లో రగులుతున్న విరహాగ్ని నల్ల సముద్రంలో పడితే
నీరనేదే ఉంటుందా...!
పుడమి తల్లి కడుపును చీల్చుకు వచ్చే కలుపు మెక్కల్ని ఏరి పారేస్తే
కల్తీ అనేదీ ఉంటుందా...!
ఘణ ఘణ మ్రేగుతున్న కంచు గంటల్ని
ప్రక్కకు పెట్టి
నీ కడుపులో రగులుతున్న
ఆకలి మంటల్ని తరిమేయ్ ముందు
ఎన్నాళ్లిలా చూస్తావూ.... ఎప్పుడెప్పుడు మారుతావు...
పడుతూ.. పడుతూ.. చస్తున్నావు
పగటి కలలా మిగి పోతున్నావు...
లే... విదిలించిన సింహం వలే ఉరకలేస్తూ... తరిమికొట్టూ..
కట్టేసిన నరాల తీగలలో
ఉడుకు రక్తాన్ని ఉరకలెత్తనీయ్
భ్రష్టు పట్టిన సమాజపు దోపిడి సంకెళ్లను
చేదించి మరో శివాజీలా చరిత్రలో సార్థకమై పో...       14.10.1999

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి