4, ఏప్రిల్ 2020, శనివారం

వింత లోకం


పెద్దరికం వెలవెల బోయిందని
కొరివితో తలగోక్కుంటే
సగం కాలిని ఎంటికలు ఎక్కిరించాల
ఏదో ఒకటని సర్డుకుపోబోతుంటే
ఆత్మాభిమానమే అడ్డొచ్చి ఆనకట్టేయ్యాల
దూరమెక్కువైతే దగ్గరవుతారని
దగ్గరలోకొస్తే దరువు దెబ్బేస్తారని
తెలిసనంకా! చిత్రము ఇదెలా....
సంకనెక్కుతేగాని బరువు తెలవకపాయె
కలుగులో చెయ్యెడుతే కరిసేది పామాయే
బుద్ది తెలవకముందు బుద్దిగా బువ్వతిన్నా...
తెలిసినంకానేమో తటపటాయిస్తున్నా
చిత్రమో... విచిత్రమో... చిత్రాతి చిత్రమో
తెల్ల ఎంటికలల్ల నల్ల పేన్లే పిరిగే...
నవ్వుతున్నోళ్లంత మనసులో తొంగిచూసి
భాదవున్నోళ్లంత గుండెమీద చెయ్యేస్తే
నాటకాలల్ల యాక్టర్లవుతారు
నగుమోముపై చిరునవ్వుతో పోజులిస్తారు
చూడయ్య నరమయ్య ఈ వింత లోకం
నడువలేవు నువ్వు నరకయ్య భూతం.                 30.06.2002

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి