నీ బుడిబుడి అడుగులతో ఒక వత్సరాన్ని ఉత్సాహంతో
నింపేసావ్
నీ బోసినవ్వుల దరహాసంతో మా జీవితాల్లో పువ్వై
పరిమళించావ్
మా ప్రస్థానంలో నీ ఆగమనంతో
వెలుగుదారిని చూపించావు
మా ఇంట విరిసిన ఈ కుసుమం
ప్రపంచంలో పరిమళించాలి
ఈ రోజు ప్రసరించిన ఉషాకిరణం
జగతి చీకట్టను పారద్రోలాలి
ఆత్మీయ మనసుతో అందిస్తున్న ఈ శుభాకాంక్షలు అందుకో
నాన్నా...
మా శ్రీజన్ కి ప్రథమజన్మదిన శుభాకాంక్షలు.... ---16.04.2010
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి