4, ఏప్రిల్ 2020, శనివారం

చాతగాని చేతులు



కాళ్లు వణుకుతున్నాయ్ ఆగిపోయిన శ్వాసకి కమురు వాసన గుబులురేపుతుంటే
స్మశానం స్పర్శ విశ్వవ్యాప్తమవుతుంది
నాగు కళ్లు చురచుర చూస్తుంటే చేవచచ్చిన చేపపిల్లకి నూతిలోనిదే ప్రపంచం కాదా...
కరువులేపిన దుమారానికి దుక్కిదున్నితె లేచేదేది!
పనిలేదని పళ్లుకొరికితే కడుపున పేగులు చిల్లులేస్తాయ్
దొంగతనమో, దొరతనమో చేతనైనది చేయమంటాయ్
పేరుపెట్టని పిలుపు వింటూ ఉరికురికి చస్తావెందుకు
చేవచచ్చిన మెండిచేతిని మతం కత్తితో నరికేదెందుకు
ఉద్యమాలూ, త్యాగాల పేరుతో చేసిందేంటో తెలిసేదెప్పుడు
నీతిలేదని కళ్లురిమితే మత్తు తలకి ఎక్కిందెందుకు
కలలనంటవ్, పడకలేస్తవ్ పనికిమాత్రం పిండం పెడతవ్
సమాజమంటూ కేకలేసే పిచ్చి కుక్కే ఈ రాజకీయం
చదివేబళ్లు, కొలిచేగుళ్లు, మంచం కోళ్లు, పక్కింటోళ్లు
ఇందుగలదందు లేదన...
ఎక్కడచూసినా పిచ్చికుక్కలే రాజకీయాల కంపుతోవలే
ఇంక! చదువెందుకు చాకిరి చెయ్యి
కాళ్లన్న గట్టిపడ్తయి, దమ్ము రాక ముక్కు పడతది
మనసు మెత్తం స్థబ్దుగుంటది, లొళ్లులన్నా సద్దుమణుగుతయి
సిగ్గులేని బతుకన్నా మనది
మనమంటే మనమే మరి.           ---13.12.2002

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి